Nara Rohith : 'సౌండ్ ఇంజనీర్' గా నారా రోహిత్.. బర్త్ డే రోజు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!

Nara Rohith : 'సౌండ్ ఇంజనీర్' గా నారా రోహిత్.. బర్త్ డే రోజు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నారా రోహిత్. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు ( జూలై 25, 2026 ) సందర్భంగా 'సౌండ్ ఇంజినీర్' అనే పేరుతో కొత్త చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించేలా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో కమెడియన్ సుదర్శన్ ఇచ్చిన సరదా వాయిస్‌ఓవర్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ముఖ్యంగా నారా రోహిత్ పోషిస్తున్న పాత్రకు వినికిడి సమస్య ఉండటం కథలో కీలక అంశంగా చూపించారు. అదే అంశాన్ని వినోదాత్మకంగా చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.

ఈ చిత్రానికి చినిమిల్లి మణి కుమార్ కథ, దర్శకత్వం వహిస్తుండగా, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తుండగా, నరేష్ విజయ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.  తమిళ స్టార్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణగా మారింది.

టైటిల్, కాన్సెప్ట్, అనౌన్స్‌మెంట్ వీడియోను బట్టి చూస్తే 'సౌండ్ ఇంజినీర్' పూర్తి స్థాయి క్లీన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిపిన వినోదభరితమైన కథను ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, నారా రోహిత్ కెరీర్‌లో ఇది మరో డిఫరెంట్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

మరోవైపు నారా రోహిత్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'కపాలి'లో నటిస్తున్నారు. దీనిలో హన్సిక మోత్వాని కథానాయికగా  పనిచేస్తుంది.  రామ్‌ గన్ని దర్శకుడు. కళ్యాణ చక్రవర్తి మంథినా,భానుకిరణ్‌ ప్రతాప నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. శనివారం ( జూలై 25, 2026 ) నారా రోహిత్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.