అక్టోబర్ 13న నారాయణమూర్తి యూనివర్సిటీ రిలీజ్

అక్టోబర్ 13న  నారాయణమూర్తి  యూనివర్సిటీ రిలీజ్

ఆర్ నారాయణమూర్తి డైరెక్ట్ చేస్తూ నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. విద్యా వ్యవస్థలోని లోపాలను చూపించేలా తెరకెక్కిన ఈ  సినిమాని అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ‘పేపర్ లీకేజ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో  దారుణంగా జరుగుతున్నాయి. ప్రపంచ యుద్ధాల కంటే  ప్రమాదకరమైనవి కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకేజీలు. ఇలాగైతే విద్యార్థులు, నిరుద్యోగులు ఏమైపోవాలి. 

 విద్యార్థులు జాతి సంపద. వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద, ప్రభుత్వాల మీద ఉందని తెలియజేసేదే ఈ చిత్రం. ఇందులో ఆరు పాటలున్నాయి. స్వర్గీయ గద్దర్ గారు , జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్, ములుగు విజయ్ గొప్పగా రాశారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ బాబూరావు దాస్, ఎడిటర్ మాలిక్, సింగర్, లిరిసిస్ట్ విజయ్ పాల్గొన్నారు.