
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు వేసేలా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో పలు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉంటే..మోడీ మాత్రం ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ జరగాలని సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, సినీ స్టార్లకు ట్యాగ్ లైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగార్జునకు మోడీ ట్యాగ్ లైన్ చేశారు. “ఎన్నో ఏళ్ళుగా మీ నటనతో మిలియన్ల కొద్ది ప్రేక్షకులకి వినోదం పంచుతున్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. మీరు భారీ స్థాయిలో ఓటర్లలో అవగాహన కలిగేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ట్వీట్ చేశారు మోడీ. ప్రధాని ట్వీట్ కు నాగార్జున రిప్లై ఇచ్చాడు. మీ మంచి మాటలకి ధన్యవాదాలు. మన ప్రజస్వామ్యాన్ని మేము నమ్మాం. తప్పక ఓటేస్తాం అని ట్వీట్ చేశాడు నాగ్.
Thank you for your kind words sir?we believe in democracy and we all will surely vote. https://t.co/JFEE4WdrNE
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 15, 2019