స్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో నేను రెడీ.. నర్గీస్‌‌‌‌ ఫక్రీ ఫస్ట్ లుక్‌‌ రిలీజ్

స్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో నేను రెడీ.. నర్గీస్‌‌‌‌ ఫక్రీ ఫస్ట్ లుక్‌‌ రిలీజ్

హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు నిర్మిస్తున్నారు.  హవీష్‌‌‌‌కు జంటగా కావ్య థాపర్ నటిస్తోంది. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కూడా ఈ చిత్రంలో మెరవబోతోందని శనివారం ప్రకటించారు. ఇందులో ఆమె ఓ స్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌ చేస్తోంది. ఇందుకు సంబంధించి నర్గీస్‌‌‌‌ ఫక్రీ ఫస్ట్ లుక్‌‌‌‌ను మేకర్స్‌‌‌‌ విడుదల చేశారు. కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ సెట్స్‌‌‌‌లో రొమాంటిక్‌‌‌‌ ఫోజ్‌‌‌‌లో నర్గీస్‌‌‌‌ కనిపిస్తోంది. 

‘రాక్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌’ మొదలు ‘హౌజ్‌‌‌‌ఫుల్‌‌‌‌ 5’ వరకు పలు బాలీవుడ్‌‌‌‌ చిత్రాల్లో గ్లామరస్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో నటించిన ఆమె.. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక వచ్చేవారం ఈ మూవీ ఆడియో రిలీజ్‌‌‌‌కు ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్, గోపరాజు రమణ, హరితేజ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.