నార్నే నితిన్ హీరోగా ‘జూనియర్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విజయ్‌తో ‘జన నాయగన్’, యశ్‌తో ‘టాక్సిక్’ సినిమాలు చేసి ప్రస్తుతం చిరంజీవితో బాబీ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నితిన్ కెరీర్‌లో ఇది 5వ చిత్రం.
శుక్రవారం తన బర్త్ డే సందర్భంగా ఈ మూవీని ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా అని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే నార్నే నితిన్ హీరోగా నటించబోయే మరో కొత్త చిత్రాన్ని కూడా శుక్రవారం అనౌన్స్ చేశారు.
సుహాస్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సర్వైవల్ డ్రామాను రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బొగ్గు గని కార్మికుడి గెటప్‌లో నార్నే నితిన్ కనిపించాడు.
