మంగళవారం జాతరకి పుష్పా వస్తున్నాడు.. ఫ్యాన్స్ గెట్ రెడీ

మంగళవారం జాతరకి పుష్పా వస్తున్నాడు.. ఫ్యాన్స్ గెట్ రెడీ

ఆర్ఎక్స్100 (RX100) మూవీ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం (Mangalavaraam). హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో..పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఈ నెల (నవంబర్ 11న) మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకలు జరపనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పుష్పా రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మంగళవారం జాతరకి పుష్పా వస్తున్నారు..నవంబర్ 11న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్స్‌లో సాయంత్రం 6 గంటలకు జరగబోయే ఈ ఈవెంట్ కు..పుష్ప ఫ్యాన్స్..రెడీ అవ్వండి అంటూ..పోస్ట్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన అజయ్ భూపతి..అల్లు అర్జున్ (AlluArjun) స్పెషల్ గెస్ట్గా వస్తున్నాడనే ట్వీట్ చేసేలోపే..ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

డైరెక్టర్ అజయ్ భూపతి గత చిత్రం మహాసముద్రంతో బిగెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. మరి మంగళవారం సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమా నవంబర్‌ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది.