అక్టోబర్ 13న సగిలేటి కథ రిలీజ్

అక్టోబర్ 13న సగిలేటి కథ రిలీజ్

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌‌‌‌ జంటగా సుద్మూన్‌‌‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సగిలేటి కథ’.  హీరో నవదీప్‌‌‌‌ సి-స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్‌‌‌‌ బలివాడ, అశోక్‌‌‌‌ మిట్టపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంతో కీలకమైన ‘చికెన్‌‌‌‌ సాంగ్‌‌‌‌’ని ఓ రెస్టారెంట్‌‌‌‌లో లాంచ్ చేశారు. దర్శకులు సాయి రాజేష్, వెంకటేష్ మహా, సందీప్ రాజ్ అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. 

హీరో నవదీప్ మాట్లాడుతూ ‘మా సి స్పెస్ ద్వారా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇందులోని కామెడీ అందరినీ నవ్విస్తుంది. సినిమా చూశాక వెజిటేరియన్స్‌‌‌‌తో సహా ప్రతి ఒక్కరికీ చికెన్ తినాలనిపిస్తుంది. అక్టోబర్ 13న వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అన్నాడు.