ఇలాంటి పాత్రలు, సినిమాలు అరుదు : నవీన్ చంద్ర

ఇలాంటి పాత్రలు,  సినిమాలు అరుదు : నవీన్ చంద్ర

నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా  శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కి  సిద్ధు జొన్నలగడ్డ, కీరవాణి అతిథులుగా హాజరయ్యారు. సిద్ధు మాట్లాడుతూ ‘ఇది యూనివర్సల్‌‌‌‌‌‌‌‌ అప్పీల్ ఉన్న కథగా అనిపిస్తోంది. అన్ని సినిమాలు వేరు.. ఇది వేరని  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే అర్థమవుతోంది. నవీన్, స్వాతి పెర్ఫార్మెన్స్ బాగుంది. 

టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. కీరవాణి మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తే ఫీల్ గుడ్‌‌‌‌‌‌‌‌ మూవీ అనిపించింది. నటీనటులు, టేకింగ్, సంగీతం  ఇవన్నీ బావున్నాయి. తప్పకుండా ప్రేక్షకుల మనసుని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అన్నారు.  నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘ఇదిచాలా స్పెషల్ మూవీ. ఇలాంటి పాత్రలు, సినిమాలు అరుదుగా వస్తుంటాయి’ అని చెప్పాడు. ఇందులోని ప్రతి పాత్ర ఒక గౌరవంతో ఉంటుందని చెప్పింది స్వాతి. నవీన్ ప్రతి షాట్‌‌‌‌‌‌‌‌లో సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తాడన్నాడు శ్రీకాంత్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు నిర్మాత యశ్వంత్. నటులు శ్రేయా, హర్ష, జ్ఞానేశ్వరి, రఘు, రాజీవ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.