
నవీన్ చంద్ర హీరోగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో కిషోర్ గరికిపాటి నిర్మించిన చిత్రం ‘షో టైమ్’. నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందించారు. కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. హీరో అడివి శేష్ ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ చిత్రాన్ని జులై 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో నవీన్ చంద్ర సైలెన్స్ అన్నట్టుగా వేలిని మూతిపై పెట్టుకోగా, మిగతా నటీనటులంతా ఆశ్చర్యంతో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.