Miss shetty Mr Polishetty Twitter Review: కామెడీతో కితకితలు పెట్టిన నవీన్, అనుష్క

Miss shetty Mr Polishetty Twitter Review: కామెడీతో కితకితలు పెట్టిన నవీన్, అనుష్క

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka shetty) జంటగా వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి( Miss shetty Mr Polishetty). మహేశ్ బాబు(Mahesh babu) అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ నిర్మించింది. జాతిరత్నాలు వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నవీన్‌ పోలిశెట్టి.. చాలా గ్యాప్‌ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక సినిమా నుండి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో హవా చూపించింది ఈ సినిమా. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా నేడు(సెప్టెంబర్‌ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమా ఎలా ఉంది? కథేంటి? నవీన్, అనుష్క జంట ఎలా ఉంది? ప్రేక్షకులను ఏమేరకు మెప్పించారు అనేది ఇప్పుడు చూద్దాం. 

ట్విటర్‌లో మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్‌ వస్తోంది. సినిమా చాలా బాగుందని, నవీన్‌ పోలిశెట్టి కామెడీతో  అదరగొట్టేశాడని, అనుష్క చాలా అందంగా కనిపించిందని, అని కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాదు సినిమాలో ఎమోషన్స్ కూడా బాగా పండాయని, చాలా రోజులు తరువాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూశామని కామెంట్స్ కనిపిస్తున్నాయి. 

ఇక మరికొందరేమో.. మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమా గురించి కాస్త మిక్సుడ్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా అనుకున్నంత లేదని, భారీగా అంచనాలు పెంచేసి నిరాశపరిచారని, కొందరు కావాలనే ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూస్ ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వస్తోంది. మొత్తంగా చెప్పాలంటే.. నవీన్ హైట్రిక్, అనుష్క స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు.