RC 17 నుంచి క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్‌‌, సుకుమార్‌‌‌‌ మూవీలో నయనతార స్పెషల్ రోల్

RC 17 నుంచి క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్‌‌, సుకుమార్‌‌‌‌ మూవీలో నయనతార స్పెషల్ రోల్

‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌‌ బస్టర్‌‌‌‌ తర్వాత హీరో రామ్ చరణ్‌‌, దర్శకుడు సుకుమార్‌‌‌‌ కాంబినేషన్‌‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. చరణ్‌‌ కెరీర్‌‌‌‌లో ఇది 17వ చిత్రం.  ఓవైపు స్క్రిప్ట్‌‌ వర్క్‌‌ ఫైనల్‌‌ స్టేజ్‌‌కు చేరుకోగా, మరోవైపు ప్రీ ప్రొడక్షన్‌‌ వర్క్స్‌‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతోందని తాజా సమాచారం.  

ఇందులో ఆమె హీరోయిన్‌‌గా కాకుండా ఓ కీలకపాత్రను పోషించబోతోందట. కథకు వెన్నుదన్నుగా నిలిచే ఓ పవర్‌‌‌‌ఫుల్‌‌ లేడీ క్యారెక్టర్‌‌‌‌ను క్రియేట్ చేసిన సుకుమార్.. ఇందుకు నయనతార పర్ఫెక్ట్ ఛాయిస్‌‌గా భావించినట్టు తెలుస్తోంది.  

అక్టోబర్‌‌‌‌లో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్‌‌ అయిన ‘మన శంకరవరప్రసాద్‌‌’లో నటించిన నయనతార.. చిరంజీవి ‘గాడ్‌‌ ఫాదర్‌‌‌‌’లో ఓ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌‌ ఖాన్‌‌ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది.