తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
రజినీకాంత్ తో, నయనతార కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన పలు చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘ధర్మన్’ కోసం ఈ కాంబినేషన్ మరోసారి తెరపైకి రాబోతుందనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఇదే నిజమైతే, ‘పెద్దన్న’ తర్వాత దాదాపు ఐదేళ్లకు వీరిద్దరినీ మరోసారి ఒకే సినిమాలో చూడొచ్చు.
#Rajinikanth x #Nayanthara - Reunion for the 5th Time. Lady Superstar Nayanthara is reportedly on board for #Dharman , and will be playing an important role in the film👀🔥. This marks the 5th time Rajinikanth and Nayanthara are joining hands on screen💥. © VP Follow 👉 @FilmyBowlTamil
— FilmyBowl Tamil (@FilmyBowlTamil) October 17, 2026
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ‘ధర్మన్’లో నయనతార పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రజనీకాంత్ కెరీర్‌లో 173వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆయన డెడ్లీ డాక్టర్‌గా కనిపించనున్నారు.
ఇందులో సిమ్రాన్, రాశీఖన్నా, శ్రీలీల, రామ్ పోతినేని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Second schedule wrapped ⭐️ superstar was fab 🧨🧨
— Ashwath Marimuthu (@Dir_Ashwath) September 4, 2026
