నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. సుందర్ సి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో ‘మహాశక్తి’గా రాబోతోంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రపంచ వినాశనం కోసం ప్రయత్నిస్తున్న దుష్టశక్తులను మహాశక్తి ఎలా అంతం చేసింది అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్‌గా అర్థమవుతోంది.
చిన్న చిన్న విషయాలకే భయపడే పోలీస్ ఆఫీసర్‌గా, దుష్టులను చీల్చిచెండాడే అమ్మవారిగా నయనతార డ్యూయల్ రోల్‌లో కనిపించింది. అతీంద్రియ శక్తులు కలిగిన లేడీ విలన్‌గా రెజీనా కనిపించింది. కన్నడ నటుడు దునియా విజయ్ మరో నెగిటివ్ రోల్‌లో కనిపించారు. ఖుష్బూ, యోగిబాబు, సునీల్, ఊర్వశి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. విజువల్ ఎఫెక్ట్స్, హిప్ హాప్ తమిళా అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.
గతంలో నయనతార లీడ్ రోల్‌లో ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’)కి ఇది సీక్వెల్. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై డా. ఇషారి కె. గణేష్ నిర్మిస్తున్నారు. నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఇదే వారంలో హిందీ చిత్రం ‘రామాయణ’ పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. రెండు భక్తి చిత్రాలు కావడంతో
బాక్సాఫీస్ దగ్గర పోటీ నెలకొంది.
