అసలైన లేడీ సూపర్ స్టార్.. 50 సెకన్స్ కోసం రూ.5 కోట్లు

అసలైన లేడీ సూపర్ స్టార్..  50 సెకన్స్ కోసం రూ.5 కోట్లు

కేవలం కమర్షియల్ అండ్ గ్లామరస్ సినిమాలే కాదు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా లేడీ సూపర్ స్టార్(Lady superstar) గా పేరు తెచ్చుకుంది నయనతార(Nayanthara). కొన్ని సంవత్సరాలుగా ఆ స్టార్ స్టేటస్ ను ఆలాగే కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఆమెతో పాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలా మంది ఇప్పటికే కనుమరుగైపోయారు.. కానీ నయన్ మాత్రం ఇప్పటికే వరుస సినిమాకు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అంతేకాదు అదే రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది. ఇటీవలే వచ్చిన సూపర్ హిట్ మూవీ జవాన్(Jawan) కోసం ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యపరిచింది నయన్.

ఇక ఇప్పుడు మరోసారి భారీ రెమ్యునరేషన్ తీసుకొని వార్తల్లోకెక్కింది ఈ బ్యూటీ. ఇటీవల నయనతార చేసిన ఒక యాడ్ కు అక్షరాలా రూ.5 కోట్లు అందుకుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అది కూడా కేవలం 50 సెకన్స్ కనిపించినందుకు. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ వర్గాలు అవాకావుతున్నాయి. ఒక్క యాడ్ కోసం రూ.5 కోట్ల.. అది కూడా కేవలం 50 సెకన్స్ కోసం. ఇది నెక్స్ట్ లెవల్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.