NBK107 మాస్ పోస్టర్ రిలీజ్

NBK107 మాస్ పోస్టర్ రిలీజ్

యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న  నందమూరి బాలకృష్ణ 107వ చిత్రంపై ప్రస్తుతం అందరి కన్నూ  పడింది. బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఫిల్మ్ NBK107 పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్  నుంచి విడుదల కాగా.. తాజా మరో  అప్​డేట్ వచ్చింది. నేడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ NBK107 కు చెందిన మాస్ పోస్టర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో బాలయ్య.. తన చేతిలో కత్తి పట్టుకొని, కోపంతో రగిలిపోతున్న మాస్ స్టైల్లో ఫోజ్ ఇచ్చారు. తాజాగా తమ అభిమాన హీరోకు సంబంధించిన మరో వార్త బయటికి రావడంతో... ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక దునియా విజయ్​, వరలక్ష్మీ శరత్​ కుమార్​లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రాక్ లాంటి సినిమాలతో విజయం వైపు అడుగులు వేస్తోన్న గోపిచంద్ మాలినేని.. బాలకృష్ణ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లోనూ ఈ మూవీపై భారీ అంచనాలున్నట్టు తెలుస్తోంది.

 

 

మరిన్ని వార్తల కోసం...

మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు

కంగనా "ధాకడ్"కు తప్పని మార్కెట్ కష్టాలు