సమ్మర్‌‌‌‌‌‌‌‌ లో రిలీజ్ కానున్న NBK 109

సమ్మర్‌‌‌‌‌‌‌‌ లో రిలీజ్ కానున్న NBK 109

దసరాకి ‘భగవంత్ కేసరి’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలకృష్ణ.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఊర్వశి రౌటేలా హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  ఇటీవల ‘యానిమల్‌‌‌‌’తో మెప్పించిన బాబీడియోల్ ఇందులో విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. ఇటీవలే తను ఈ మూవీ షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, బాబీడియోల్ మధ్య వచ్చే యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌ పోటాపోటీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌‌‌‌గా షూటింగ్‌‌‌‌ కానిచ్చేస్తున్న మేకర్స్.. రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట.

వచ్చే దసరాకి రిలీజ్‌‌‌‌ అని ప్రచారం జరిగినప్పటికీ, మే లేదా జూన్‌‌‌‌ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్‌‌‌‌లో బాలకృష్ణ పుట్టినరోజు కూడా ఉండడం ప్లస్ అవనుంది. ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 109వ సినిమా. సంక్రాంతి సందర్భంగా అప్‌‌‌‌డేట్‌‌‌‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్‌‌‌‌, ఫార్చ్యూన్‌‌‌‌ ఫోర్ సినిమాస్‌‌‌‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.