బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పవర్‌ఫుల్ లైనప్స్‌తో దూసుకెళ్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా చేస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఎన్‌బీకే 111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మాస్ అప్‌డేట్ అందించారు మేకర్స్. జూన్ 10న బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.
‘మీకు తెలిసిన బాలకృష్ణ కాదు.. మీరు అస్సలు ఊహించని బాలకృష్ణ.. ఇకపై వింటేజ్ కాదు.. న్యూ ఏజ్ మాత్రమే’ అంటూ ఈ పోస్టర్‌పై క్యాప్షన్ ఇవ్వడం ఆయన ఫస్ట్ లుక్‌పై మరింత క్యూరియాసిటీని క్రియేట్ అయ్యింది. అలాగే పోస్టర్‌లో భారీ చైన్లు, బుల్లెట్ల విజువల్స్‌తో పాటు ‘ఎన్‌బీకే పట్ల జాగ్రత్త’ అనే హెచ్చరిక తరహా డిజైన్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. దీంతో గత చిత్రాలకు భిన్నమైన లుక్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో బాలయ్యను చూపించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన బర్త్‌డే గిఫ్ట్‌గా టైటిల్ టీజర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
