నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ. 'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ గా ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకొచ్చింది, ఇది చూసి నందమూరి, మంచు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బాలయ్యకు విలన్ గా..
ఈ సినిమాలో 'రాకింగ్ స్టార్' మంచు మనోజ్ ఒక పవర్ ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో (విలన్‌గా) నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల క్రితం 'ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?' సినిమాలో బాలయ్య, మనోజ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు 'మాస్ బాప్'లు వెండితెరపై తలపడనున్నారు..
గోపీచంద్ మలినేని మాస్ ప్లాన్
ఇటీవలే 'మిరాయ్' సినిమాతో గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన మంచు మనోజ్, ఈ #NBK111 కోసం మునుపెన్నడూ చూడని రీతిలో ముతక, రగ్గడ్ లుక్‌లోకి మారబోతున్నారట. గోపీచంద్ మలినేని రాసిన క్యారెక్టరైజేషన్ వినగానే మనోజ్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశాడని టాక్. బాలయ్య రౌద్ర రూపానికి ధీటుగా నిలిచే బీస్ట్ లాంటి పాత్రలో మనోజ్ కనిపించబోతున్నాడు. దీనికోసం ఆయన భారీ శారీరక మేకోవర్ కూడా ప్లాన్ చేశారు.
Happy Birthday dear @HeroManoj1 🤗
— Gopichandh Malineni (@megopichand) May 20, 2026
It’s always a delight to see your energy light up every place around you ❤️
Can’t wait to witness what’s in store with #NBK111 . pic.twitter.com/7P9mtnvDVh
భారీ బడ్జెట్ తో..
వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాను కూడా నిర్మించారు. బాలయ్యకు ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చే థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. పవర్‌హౌస్ యాక్టర్ సముద్రఖని ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
బాలకృష్ణ లెజెండరీ స్వాగ్‌కు తోడు, మంచు మనోజ్ విలనిజం తోడైతే థియేటర్లు బద్దలైపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, త్వరలోనే మనోజ్ సెట్స్‌లో జాయిన్ కానున్నారు. బాక్సాఫీస్ దగ్గర మరో మాస్ జాతర గ్యారెంటీగా ఫ్యాన్స్ ధిమా వ్యక్తం చేస్తున్నారు.
Some birthdays come as blessings.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 20, 2026
And this birthday has brought me one of the most special gifts I could have asked for…
And finally… it’s happening 🔥 🔥
A long awaited combination with our Lion NBK Ballaya anna, under the direction of Gopichand Malineni Garu.
A moment… pic.twitter.com/MzRjWacDkE
