రూల్స్ రంజన్‌.. స్టోరీ చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది : నేహా శెట్టి

రూల్స్ రంజన్‌..  స్టోరీ చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది : నేహా శెట్టి

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్‌‌’. రత్నం కృష్ణ దర్శకుడు. ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహాశెట్టి చెప్పిన విశేషాలు.. ‘‘ఇందులో నేను ‘సన’ అనే పాత్రలో కనిపిస్తా. పక్కింటమ్మాయి తరహా పాత్ర. గ్లామర్‌‌‌‌గా ఉంటుంది కానీ ‘డీజే టిల్లు’లో రాధికలా ఇది సెల్ఫిష్ క్యారెక్టర్ మాత్రం కాదు. 

తిరుపతిలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే అమ్మాయి. ఇక స్టోరీ చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది. రొటీన్‌‌ అబ్బాయి, అమ్మాయిల కథ కాదు. లవ్‌‌ థీమ్ ఇంటరెస్టింగ్‌‌గా ఉంటుంది. కాన్‌‌ఫ్లిక్ట్‌‌తో పాటు కామెడీ ఉంది. నటుడిగా కిరణ్‌‌ చాలా కూల్. సెట్స్‌‌లో చాలా కామ్‌‌గా ఉంటాడు. నేను అందుకు పూర్తి వ్యతిరేకం (నవ్వుతూ). సెట్స్‌‌లో సరదాగా మాట్లాడిస్తాను. తనతోనే కాదు డైరెక్టర్, ఇతర యాక్టర్స్‌‌తోనూ అలాగే ఉంటాను. అలా ఉంటేనే కెమెరా ముందు ఫ్రీగా ఉండగలం. 

 రత్నం కృష్ణ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కనుక చాలా ఫోకస్డ్‌‌గా ఉంటారు. ఈ సినిమా షూటింగ్ మొత్తంలో ‘సమ్మోహనుడా’ పాటకు డాన్స్ చేయడమే నాకు అతి పెద్ద చాలెంజ్. నీళ్లలో, నిప్పులో, పూల మధ్య డాన్స్ చేయాల్సి వచ్చింది. షూటింగ్ ఎంత కఠినంగా ఉందో పాట అంత బాగా వచ్చింది. శ్రమకి తగ్గ ఫలితం దక్కింది. డీజే టిల్లు, బెదురులంక 2012 చిత్రాల తరహాలోనే ఈ సినిమాలోని నా పాత్ర కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నా’’