వామ్మో అంతనా.. భారీ ధరకు పుష్ప 2 డిజిటల్ రైట్స్!

వామ్మో అంతనా.. భారీ ధరకు పుష్ప 2 డిజిటల్ రైట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..పుష్ప 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్(Netflix)సొంతం చేసుకున్నట్టు సమాచారం. పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా..సుకుమార్ క్రియేటివ్ ఐడియాస్..అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంచనాల దృష్ట్యా..సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి తగ్గేదేలే అన్నట్టు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, పుష్ప సీక్వెల్ కోసం అమెజాన్ కు..నెట్ ఫ్లిక్స్ మధ్య ఎంతోగాను పోటీ ఏర్పడటంతో..చివరికి దాదాపు మూడు రేట్లు ఎక్కువ మొత్తంతో పుష్ప2 ను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకోంది. సుమారు రూ.100కోట్లకు ఈ ఓటీటీ డీల్ జరిగినట్టు సమాచారం. దీంతో మైత్రీ మూవీ మేకర్స్‌ కు భారీ డీల్ కుదిరినట్టే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి. పుష్ప ది రూల్ మూవీ ఆగస్టు 15, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.