
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'రానా నాయుడు సీజన్ 1'కు ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. తాజాగా రానా నాయుడు సీజన్ 2 (Rana Naidu 2) కు సంబంధించిన ఓ వీడియోను ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో సీజన్ 2 షూటింగ్ ప్రారంభమైనట్లు నెట్‌ఫ్లిక్స్ చిత్రీకరణ జరుగుతోన్న చిన్న వీడియోను షేర్ చేసింది. అందులో రానా,వెంకటేశ్‌ల మధ్య యాక్షన్ సీన్స్ జరుగుతున్నట్లు మేకర్స్ చూపించారు. దీంతో త్వరలోనే సీజన్ 2 ఆడియన్స్ ముందుకురానున్నట్లు తెలుస్తోంది.
Rana Naidu Season 2 is now f̶i̶x̶i̶n̶g̶ filming ?#RanaNaiduOnNetflix pic.twitter.com/5Xh5zq8nGU
— Netflix India (@NetflixIndia) July 23, 2024
ఇదివరకే..సీజన్ 2 ఉండబోతుందని ఏప్రిల్ నెలలోనే 18 సెకన్ల వీడియోతో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వీడియోకి ఇచ్చిన ట్యాగ్ కూడా అంచనాలు పెంచేసింది. "మరేం చింతించకండి..మీ బాధనంతనంటినీ పోగొట్టడానికి నాయుడులు మళ్లీ తిరిగి వస్తున్నారు..రానా నాయుడు సీజన్ 2 త్వరలోనే విడుదల కానుందంటూ' అప్పట్లో నెట్ ఫ్లిక్స్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తి్స్తోన్న ఈ సీజన్ 2 గ్లింప్సెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri ♥?#RanaNaidu season 2 is coming soon! pic.twitter.com/KVJDrIB5wH
— Netflix India (@NetflixIndia) April 19, 2023
రానా నాయుడు సీరీస్ విషయానికి వస్తే..
ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా రూపొందించిన 'రానా నాయుడు' సిరీస్ మార్చి10న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. విడుదలైన మూడు వారాల పాటు భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా నంబర్.1 స్థానంగా నిలిచి ట్రెండ్ స-ృష్టించింది. వరుసగా ఐదవ వారంలోనూ దేశంలోని టాప్ 10 సిరీస్‌లలో ఒకటిగా రానా నాయుడు దూసుకుపోతోంది. విడుదలైన రెండు వారాల పాటు నాన్-ఇంగ్లీష్ టీవీ షోల కోసం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో 'రానా నాయుడు' కూడా ట్రెండ్ అయ్యాడు.
సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ 'రానా నాయుడు' సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ రూపొందించారు, సహ-దర్శకత్వం కూడా వహించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, సుశాంత్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ పలు కీలక పాత్రలు పోషించారు.