నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ 'సూపర్ సుబ్బు'.. సందీప్ కిషన్ కామెడీ జాతరకు డేట్ ఫిక్స్!

నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ 'సూపర్ సుబ్బు'.. సందీప్ కిషన్ కామెడీ జాతరకు డేట్ ఫిక్స్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లవర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మొట్టమొదటి క్రేజీ తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' (Super Subbu). ఎప్పుడో అనౌన్స్ అయి, ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచిన ఈ సిరీస్..  లేటెస్ట్ గా సరికొత్త అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ మోస్ట్ అవైటెడ్ సిరీస్ డిజిటల్ ప్రీమియర్‌కు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోని కమింగ్ సూన్ (Coming Soon) సెక్షన్‌లో 'సూపర్ సుబ్బు' ప్రత్యక్షమవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ జూన్ నెలలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరీ ముఖ్యంగా జూన్ 26, 2026న ఈ సాలిడ్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గట్టిగా టాక్ వినిపిస్తోంది.

నవ్వుల జాతర..

గతంలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ సిరీస్ గ్లింప్స్, టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ అండ్ క్వీర్కీ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఆ టీజర్ సిరీస్‌పై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ప్రసిద్ధ చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మించారు.

ఏకమైన కామెడీ కింగ్స్..

ఇక ఈ సిరీస్‌లో కాస్టింగ్ విషయానికొస్తే.. నవ్వుల పూత పూయించడానికి టాలీవుడ్ కామెడీ కింగ్స్ అంతా ఏకమయ్యారు. సందీప్ కిషన్ లీడ్ రోల్ చేస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు బ్రహ్మానందం, మురళీ శర్మ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, మానస చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతమంది కామెడీ లెజెండ్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో.. నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ బాక్సాఫీస్ రేంజ్ లో ఓటీటీని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..