సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. పసికూన చేతిలో దారుణ ఓటమి

సౌతాఫ్రికాకు బిగ్ షాక్..  పసికూన చేతిలో దారుణ ఓటమి

ప్రపంచకప్‌లో దూసుకుపోతున్న సౌతాఫ్రికాకు పసికూన  నెదర్లాండ్స్‌  బిగ్ షాకిచ్చింది. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్‌ 38  పరుగుల తేడాతో విజయం సాధించింది. 246 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన  సౌతాఫ్రికా 207 పరుగులకే ఆలౌటైంది.  దీంతో సౌతాఫ్రికా వరుస విజయాలకు బ్రేక్ పడగా,  నెదర్లాండ్స్‌   ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది.  

సఫారీ టీమ్ లో డేవిడ్ మిల్లర్(43) తప్పా మిగితా ఆటగాళ్లంతా నిరాశపరిచారు.  చివర్లో కేశవ్ మహారాజ్(41)  కాసేపు మెరుపులు మెరిపించిన ఫలితం లేకుండా పోయింది.  ఇక నెదర్లాండ్స్‌   బౌలర్లలో  లోగాన్ వాన్ బీక్ 3 , పాల్ వాన్ మీకెరెన్, మెర్వే, లీడే తలో రెండు,  బీక్ ఒక వికెట్ తీశాడు.  

అంతకుముందు బ్యాటింగ్ చేసిన  నెదర్లాండ్స్‌  245 పరుగులు చేసింది.  కాగా ఇటీవలే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు అఫ్గానిస్తాన్‌ షాకిచ్చిన సంగతి తెలిసిందే.