
సినిమా స్టార్స్ లేదా వేరే ఎవరైనా సెలబ్రెటీస్ కనిపించిన సెల్ఫీలు తీసుకోవడం అనేది ప్రేక్షకులకు ఉన్న చిన్న సరదా. కానీ, కొంతమంది స్టార్స్ ఆ సరదాని కూడా సీరియస్ గా తీసుకొని వారితో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పటికే అలాంటి ఇన్సిడెంట్ లు చాలానే జరిగాయి. వారిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా బాగానే జరుగుతూనే ఉండటం కూడా మనం చూసాం. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. తనపై అభిమానంతో సెల్ఫీ అడిగిన ఒక అభిమానితో దురుసుగా ప్రవర్తించారు బాలీవుడ్ బ్యూటీ హేమమాలిని(Hemamalini).
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ బ్యూటీ హేమమాలిని ఇటీవల ప్రముఖ గేయ రచయిత గుల్జర్ బయోగ్రఫీ గుల్జార్ సాబ్: హజార్ రహే మడ్ కే దేఖిన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా ఓ అభిమాని ఆమెను సెల్ఫీ ఇవ్వమని అడిగారు.. దానికి హేమమాలిని కాస్త దురుసుగా సమాధానమిస్తూ.. నీకు సెల్ఫీలు ఇవ్వడానికి రాలేదిక్కడికి అన్నారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చుసిన నెటిజన్స్ కూడా అదే రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. సెల్ఫీ అడిగినందుకు ఇంత పొగరెందుకో.. అంటూ మండిపడుతున్నారు.