Sai Sudarshan: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లినప్పటికీ, ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సుదర్శన్, వరుసగా రెండోసారి ‘హిట్ వికెట్’గా వెనుదిరగడంపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా రెండోసారి హిట్ వికెట్:
215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 32 బంతుల్లోనే 58 పరుగులు చేసి మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చిన సాయి సుదర్శన్.. 13వ ఓవర్లో బ్రిజేష్ శర్మ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో చేతిలోంచి బ్యాట్ వదిలేశాడు. ఆ బ్యాట్ వెళ్లి నేరుగా వికెట్లను తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. వారంలోనే ఇలా జరగడం ఇది రెండోసారి కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
నెట్టింట విమర్శల పర్వం:
* ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదు.. ఒక అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో, అది కూడా క్వాలిఫయర్-2 వంటి హైప్రెజర్ మ్యాచ్‌లో బ్యాట్ గ్రిప్‌పై కనీస అవగాహన లేకుండా ఆడటం ఏంటి అని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒకే తప్పు చేయడం అస్సలు క్షమించరానిదని ఫైర్ అవుతున్నారు.
సాయి సుదర్శన్‌పై ట్రోల్స్:
సాయి సుదర్శన్ అవుట్ అయిన విధానం చూసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పిచ్‌పైనే మోకాళ్లపై కూలబడి తల పట్టుకున్న విజువల్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందిస్తూ.. పాపం గిల్.. కష్టపడి మ్యాచ్ గెలిపిస్తుంటే, ఈయన మాత్రం వింత వింత అవుట్లతో కెప్టెన్‌కు బీపీ తెప్పిస్తుండటంతో.. గిల్ ఏడవక ఏం చేస్తాడు? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
జర గ్లోవ్స్ మార్చండి బాస్:
సాయి సుదర్శన్ వినియోగించే గ్లోవ్స్ లేదా బ్యాట్ గ్రిప్‌లో ఏదో లోపం ఉంది.. చేతికి చెమట రావడంతోనే బ్యాట్ జారిపోతుందా? లేక ఆడేటప్పుడు గ్రిప్ దొరకట్లేదా? వచ్చే మ్యాచ్ కల్లా గ్లోవ్స్ మార్చకపోతే ఫైనల్లో గుజరాత్‌కు భారీ నష్టం తప్పదని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో మీమ్స్:
మరికొందరు నెటిజన్లు ఈ విచిత్రమైన అవుట్‌పై క్రేజీ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. వచ్చే మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ స్వయంగా సాయి సుదర్శన్ చేతికి టేప్ వేసి పంపాలేమో అని మ్యాచ్ అనంతరం గిల్ ఫన్నీ కామెంట్స్ తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బ్యాట్ పట్టుకోవడం రాకపోతే ఫెవికాల్ వేసుకుని క్రీజులోకి రా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత బాధ్యతారహితమైన షాట్ సెలెక్షన్ తో జట్టును కష్టాల్లో పడేసాడని, ఫైనల్ మ్యాచ్‌లోనైనా ఇలాంటి బండ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని గుజరాత్ టైటాన్స్ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. మరీ ఆర్సీబీతో జరిగే ఫైనల్ మ్యాచులోనైనా సాయి సుదర్శన్ మరోసారి హిట్ వికెట్ కాకుండా జాగ్రత్త పడతాడో లేదో చూడాలి.
This is how the Sai Sudharshan Escapes from Hit wicket 😭😭
— 🦋 Rithvika🕊️ (@NyxDoll_21) May 30, 2026
This video deserves Reach 💛#IPLFinals #RRvsGT #GTvsRR #RCB pic.twitter.com/yV8yjLPPS1
🚨 MASSIVE STATEMENT BY SHUBMAN GILL ON SAI SUDHARSHAN HIT WICKETS 🚨
— Cricket Central (@CricketCentrl) May 30, 2026
"I don't think no one has seen anything like that. Two matches in a row, the way he got out. I saw some video on social media about taping his hand, I think I am going to have to do that in the next match."…
Shubman Gill , Sai Sudharshan, Vaibhav Suryavanshi #RRvsGT #GTvsRR pic.twitter.com/B77C6M3PqI
— Rohan (@Cricket270477) May 29, 2026
