రేవంత్ హీరోగా కొత్త చిత్రం షురూ

రేవంత్ హీరోగా కొత్త చిత్రం షురూ

రేవంత్ హీరోగా రామ్ భరదరం దర్శకత్వంలో ఓ యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ రూపొందుతోంది. ఆద్య శర్మ హీరోయిన్‌‌.  విడిగేపల్లి కృష్ణ మొకిలా నిర్మాత. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  

వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  లవ్‌‌, ఎమోషన్స్‌‌తో కూడిన  ఈ చిత్రాన్ని యూత్‌‌,  ఫ్యామిలీస్‌‌కు నచ్చేలా తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు తెలియజేశాడు.

 హైదరాబాద్,  చీరాలలో టాకీపార్ట్, సింగపూర్‌‌‌‌లో పాట​లను చిత్రీకరించనున్నామని నిర్మాతలు వెల్లడించారు.  రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరుదూరి రాజా మాటలు రాస్తున్నారు.