శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‎లో కొత్త మూవీ స్టార్ట్

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‎లో కొత్త మూవీ స్టార్ట్

శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో అనిల్ సుంకర ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ముహూర్తపు షాట్‌‌‌‌కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. క్లాప్ కొట్టగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కెవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌‌‌‌‌‌‌‌గా, నందు సవిరిగాన, గోపీ మోహన్ రైటర్స్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. శ్రీను వైట్ల మార్క్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు  సినిమా ప్రారంభోత్సవం రోజే ప్రపంచవ్యాప్త థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్స్ వివరాలను ప్రకటించడం విశేషం.