
టైటిల్ : పడక్కలం
ప్లాట్ ఫాం : జియో హాట్ స్టార్డై
రెక్షన్ : మను స్వరాజ్కా
స్ట్ : సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్, అరుణ్ ప్రదీప్, అరుణ్ అజికుమార్, నిరంజన అనూప్, పూజా మోహన్‌రాజ్, ఇషాన్ షౌకత్
షాజీ (సూరజ్ వెంజరమూడు), రంజిత్ (షరాఫుద్దీన్) ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఓడీ) పోస్ట్ ఖాళీ అవుతుంది. ఆ పోస్ట్ కోసం ఇద్దరూ పోటీ పడతారు. చివరకు స్టూడెంట్స్ కోరికమేరకు షాజీని హెచ్‌వోడీగా నియమిస్తారు. కానీ.. రంజిత్ తనకున్న సూపర్ పవర్స్‌తో అందరి ముందు షాజీని నెగెటివ్‌గా చూపిస్తాడు. షాజీ ప్రవర్తన కూడా మారిపోతుంది. అదే కాలేజీలో చదువుతున్న జితిన్ (సందీప్ ప్రదీప్)కు అనుమానం వచ్చి.. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
అప్పుడు రంజిత్ ఒక చిన్న పెట్టెను తెరిచి ఏవో మంత్రాలు చదవడం జితిన్ చూస్తాడు. దానివల్లే అంతా మారిపోయిందని అతనికి తెలిసిపోతుంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి రంజిత్‌ని ఫాలో అయ్యి పెట్టెను కొట్టేస్తాడు. కానీ.. దాన్ని ఓపెన్ చేసే పాచికలు మాత్రం రంజిత్ దగ్గరే ఉండిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఆ పెట్టెకు ఎలాంటి శక్తులు ఉన్నాయి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
విడదీయలేని అనుబంధం
టైటిల్ : మామన్,
ప్లాట్ ఫాం : జీ5,
డైరెక్షన్ : ప్రశాంత్ పాండియరాజ్,
కాస్ట్ : సూరి, ఐశ్వర్య లక్ష్మి, రాజ్‌కిరణ్, శ్వాసిక, ప్రగీత్ శివన్, బాబా భాస్కర్
ఇన్బా (సూరి)కు తన అక్క గిరిజ (శ్వాసిక) అంటే చాలా ఇష్టం. ఆమెకు రవి (బాబా భాస్కర్)తో పెండ్లి జరుగుతుంది. కొన్ని సంవత్సరాలపాటు ఎదురుచూసిన తర్వాత గిరిజ ఆమె గర్భవతి అవుతుంది. గిరిజను తనే రెగ్యులర్‌గా హాస్పిటల్ విజిట్స్‌కు తీసుకెళ్తాడు. ఆ టైంలోనే ఇన్బా డాక్టర్ రేఖ (ఐశ్వర్య లక్ష్మి)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత గిరిజకు నీలన్ (ప్రగీత్ శివన్) పుడతాడు. అతన్ని ఇన్బా చాలా ప్రేమగా చూసుకుంటాడు. రోజులు గడిచేకొద్దీ ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది.
నీలన్ పుట్టిన ఐదు సంవత్సరాల తరువాత ఇన్బా, రేఖల పెండ్లి జరగుతుంది. ఆ తర్వాత కూడా ఇన్బాని విడిచిపెట్టి నీలన్ ఉండలేకపోతాడు. దాంతో వీళ్ల బంధం ఇన్బా–రేఖల దాంపత్య జీవితానికి సమస్యగా మారుతుంది. ఇన్బాకు తన అల్లుడే ప్రపంచం. అతని కోసం ఏ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దాంతో దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.
గౌరవాన్ని కాపాడుకునేందుకు..
టైటిల్ : మర్యాదే ప్రశ్నే ,
ప్లాట్ ఫాం : సన్‌నెక్స్ట్,
డైరెక్షన్ : నాగరాజ సోమయాజి,
కాస్ట్ : పూర్ణచంద్ర మైసూర్, రాకేష్ అడిగా, సునీల్ రావ్, తేజు బెలవాడి, ప్రభు ముండ్కూర్, రేఖ కుడ్లిగి
ఈ కథ బెంగళూరులో ఉంటున్న సూరి (రాకేశ్ అడిగా), సతీష (సునీల్ రావ్), మాంజా (పూర్ణచంద్ర మైసూర్)లు మంచి ఫ్రెండ్స్. సూరి ఎలాగైనా కార్పొరేటర్ కావాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే దగ్గర కష్టపడి పనిచేస్తుంటాడు. సతీష ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. మాంజా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ.. ఎలాగైనా సొంత కారు కొనాలని కలలు కంటుంటాడు.
సతీష చెల్లెలు లక్ష్మి (తేజు బెలవాడి) ఒక మాల్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తుంటుంది. మాంజా, లక్ష్మి ప్రేమించుకుంటారు. ఇంతలోనే సతీష రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత బాగా సంపన్నులైన రాఖీ (ప్రభు ముండ్కూర్), శెట్టి (షైన్ శెట్టి), పీకే (శ్రావణ్), నిఖిల్ (హరిహరన్)లు ఈ సూరి, మాంజాల జీవితాల్లోకి అడుగుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.