దుబాయ్‌‌లో మొదలైన సీసీఎల్ కొత్త సీజన్.. మెరిసిన టాప్ స్టార్స్

దుబాయ్‌‌లో మొదలైన సీసీఎల్ కొత్త సీజన్.. మెరిసిన టాప్ స్టార్స్

సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 10వ సీజన్‌‌ను ఫిబ్రవరి 2న  దుబాయ్‌‌లో స్టార్ట్ చేశారు. బూర్జ్ ఖలీఫాపై ఈ సీజన్ ప్రోమోను లాంచ్ చేశారు.  సీసీఎల్ మొత్తం 8 జట్ల నుండి సూపర్ స్టార్లు, కెప్టెన్లు కిచ్చా సుదీప్ (కన్నడ), సోహైల్ ఖాన్ (హిందీ), ఆర్య, జీవా (తమిళ), థమన్, సుధీర్ బాబు (తెలుగు), జిషు సేన్‌‌గుప్తా (బెంగాల్), బన్ను ధిల్లాన్, సోనూ సూద్ (పంజాబీ), ఇంద్రజిత్ సుకుమారన్, ఉన్ని ముకుందన్ (మలయాళం)  ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీసీఎల్ ఫౌండర్,  మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ ‘విభిన్న భాషల నుండి 200 మందికి పైగా నటీనటులను ఒకచోట చేర్చే ఏకైక స్పోర్ట్స్ లీగ్ ఇది’ అని చెప్పారు. గ్రాండియస్ లీగ్ ఫిబ్రవరి 23న షార్జాలో ప్రారంభమవుతుంది.