నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ ఛాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోర్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అంటున్న కియారా అద్వానీ

నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ ఛాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోర్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అంటున్న కియారా అద్వానీ

కొంత గ్యాప్ తర్వాత తిరిగి సెట్స్‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టింది కియారా అద్వాని. బాలీవుడ్ హీరో సిద్దార్థ్‌‌‌‌‌‌‌‌ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఆమెకు.. ఈ ఏడాది  జులైలో కూతురు పుట్టింది. ప్రెగ్నెన్సీ, డెలివరీ కారణంగా గత కొంతకాలంగా షూటింగ్స్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న కియారా.. మళ్లీ ఇప్పుడు కెమెరా ముందుకొచ్చింది.  

డెనిమ్‌‌‌‌‌‌‌‌ జీన్స్‌‌‌‌‌‌‌‌ షర్ట్‌‌‌‌‌‌‌‌, షార్ట్స్‌‌‌‌‌‌‌‌లో ఇలా సోమవారం షూటింగ్‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌‌‌‌‌లో మెరిసింది. మీడియా కెమెరాలకు స్టన్నింగ్‌‌‌‌‌‌‌‌ ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోస్‌‌‌‌‌‌‌‌, ఫొటోస్‌‌‌‌‌‌‌‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మరోవైపు షూస్‌‌‌‌‌‌‌‌ మాత్రమే కనిపించేలా ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ ఛాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోర్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని క్యాప్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఇది తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ గురించి అని అర్థమవుతోంది. 

ఇక ఈ ఏడాది జనవరిలో రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌కు జంటగా ఆమె నటించిన ‘గేమ్ ఛేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, ఆగస్టులో హృతిక్‌‌‌‌‌‌‌‌కు జంటగా నటించిన ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’  చిత్రాలు విడుదలై నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఆమె కన్నడ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యశ్‌‌‌‌‌‌‌‌కు జంటగా ‘టాక్సిక్‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో నటిస్తోంది. అలాగే రణవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌కు జంటగా ‘డాన్‌‌‌‌‌‌‌‌ 3’లో కూడా కనిపించనుంది.