బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పవర్‌ఫుల్ లైనప్స్‌తో దూసుకెళ్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా చేస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ చిత్రీకరించగా, నెక్స్ట్ షెడ్యూల్ కోసం ముంబై వెళ్లనుందట టీమ్.
జూన్ 7నుంచి ముంబైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో సినిమాకు మేజర్ పార్ట్ అయిన యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 111వ చిత్రమిది. ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మనోజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఇక జూన్ 10న బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ‘వీర సింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.
