Neymar Tears: నిజమైన ఫ్యాన్స్ గుండెలు బరువెక్కే సీన్ అబ్బా ఇది.. నిన్న (బుధవారం) రాత్రి ఫ్లోరిడాలోని మియామి స్టేడియంలో జస్ట్ ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరగలేదు.. అక్కడ ఒక ప్యూర్ ఎమోషనల్ డ్రామా కొనసాగింది. స్కాట్లాండ్‌పై బ్రెజిల్ 3–0తో వన్-సైడ్ గేమ్ ఆడుతున్న టైమ్‌లో.. మ్యాచ్ 76వ నిమిషంలో బోర్డుపై జెర్సీ నంబర్ 10 దర్శనమిచ్చింది. అంతే.. మ్యాథ్యూస్ కున్హా ప్లేస్‌లో బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ (Neymar Jr) మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అది జస్ట్ ఒక నార్మల్ ప్లేయర్ సబ్‌స్టిట్యూషన్ కాదు.. గాయాలనే నరకంతో, కెరీర్ అయిపోయిందన్న విమర్శలకి ఒక ఆటగాడు చేసిన 981 రోజుల సుదీర్ఘ పోరాటానికి ముగింపు. మళ్లీ తన దేశం తరపున వరల్డ్ కప్ గడ్డపై ఆడాలనే కలను నిజం చేసుకున్న అద్భుతమైన క్షణమది.
గ్రౌండ్లోనే ఏడ్చేసిన నెయ్‌మార్:
నెయ్‌మార్ మైదానంలోకి రాగానే స్టేడియంలోని వేలాది మంది బ్రెజిల్ అభిమానులు పసుపు రంగు జెర్సీలు ఊపుతూ నినాదాలతో హోరెత్తించారు. ఆ అద్భుతమైన స్వాగతానికి, తను దాటి వచ్చిన కష్టాలకు నెయ్‌మార్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. బెంచ్ పైనా, మైదానంలోనూ నెయ్‌మార్ తన కన్నీళ్లను తూడ్చుకుంటున్న విజువల్స్ బ్రాడ్‌కాస్ట్ కెమెరాల్లో రికార్డవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మనసులు కరిగిపోయాయి.
నెయ్‌మార్ కెరీర్‌ను దెబ్బతీసిన అదృష్టం!
గత మూడేళ్లుగా వరుస గాయాలు నెయ్‌మార్ కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అక్టోబర్ 2023లో బ్రెజిల్ తరపున చివరి అధికారిక మ్యాచ్ ఆడిన నెయ్‌మార్.. ఆ తర్వాత మోకాలికి సర్జరీలు, సుదీర్ఘ పునరావాస (Rehab) ప్రక్రియలతో ఇంటర్నేషనల్ గేమ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. బ్రెజిలియన్ సిరీ-ఏ లో శాంటోస్ తరపున ఆడుతున్నప్పుడు మే 17న అతని కుడి పిక్క కండరానికి (Right calf) గ్రేడ్-2 గాయం అయ్యింది. దాంతో నెల రోజులకు పైగా ఆటకు దూరమయ్యాడు. నెయ్‌మార్ శరీరం ఇక అంతర్జాతీయ స్థాయికి సహకరించదేమో అన్న మీడియా విమర్శలకు బుధవారం నాటి ఎంట్రీతో అతను గట్టి సమాధానం చెప్పాడు.
ALSO READ : భారత్ సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవం..
కోచ్ అన్సెలొట్టి నమ్మకం:
నెయ్‌మార్ ఫిట్‌నెస్‌పై ఎన్నో అనుమానాలు ఉన్నా, బ్రెజిల్ బాస్ కార్లో అన్సెలొట్టి అతని రికవరీ టైమ్‌లైన్‌పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. కోచ్ ఉంచిన నమ్మకాన్ని నెయ్‌మార్ నిలబెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వినీషియస్ జూనియర్ ఫస్ట్ హాఫ్‌లోనే రెండు అదిరిపోయే గోల్స్ కొట్టగా, 60వ నిమిషంలో మ్యాథ్యూస్ కున్హా మూడో గోల్ చేసి బ్రెజిల్ విజయాన్ని ముందే ఖరారు చేశారు. కానీ, చివరి 15 నిమిషాల నెయ్‌మార్ క్యామియో (Cameo) నే ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అయింది.
Os seguranças querendo barrar o Filho do Neymar pô..
— FlamenGOL (@FlamenGOL_81) June 25, 2026
Kkkkkkkkkkkkkkkkkkkkkkkk pic.twitter.com/Y7o2vRJ1Fm
Neymar was in tears after his first match for Brazil since October 2023 🥺 pic.twitter.com/p7hKmq0H5E
— B/R Football (@brfootball) June 25, 2026
الافضل في التاريخ 🐐🐐🔥 pic.twitter.com/EyuffsoR4v
— Team Neymar (@TeamNey10) June 24, 2026
