కాళేశ్వరంపై 20న ఎన్జీటీ తుది తీర్పు

కాళేశ్వరంపై 20న ఎన్జీటీ తుది తీర్పు

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​పై దాఖలైన పిటిషన్లపై తీర్పును నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్డర్​ కాపీని రిజర్వ్​ చేసినట్లు జస్టిస్ ఏకే గోయల్​ ఆధ్వర్యంలోని ధర్మాసనం సోమవారం వెల్లడించింది.  కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లపై వాదనలు ముగిశా యంది. 2018 లో హయతుద్దీన్​ అనే వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీని ఆశ్రయించారు. ప్రాజెక్టు డిజైన్​ మార్చాక రాష్ట్ర సర్కారు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్జీటీలో ఈ పిటిషన్​పై రెండేళ్లుగా విచారణ కొనసాగుతూ వస్తోంది. మరోవైపు, ఇదే అంశంపై సిద్దిపేటకు చెందిన తుమ్మనపల్లి శ్రీనివాస్ సహా పలువురు ఎన్జీటీని ఆశ్రయించారు.

ఆర్టీసీ రూట్లు ప్రైవేటుకు..మనోళ్లు నడపరు ఏపీని నడపనివ్వరు