- గతంలో బెంగళూరు నియోజకవర్గంలో ప్రకాశ్‌రాజ్‌కు ఓటు
- ఆయనకు 4 రాష్ట్రాల్లో ఓటుందంటూ ఇటీవల బెంగళూరు కోర్టులో కేసు
బెంగళూరు: ఓటర్ లిస్ట్‌లోంచి తన పేరును తొలగించారని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. బెంగళూరు నియోజకవర్గంలోని ఓటర్ లిస్ట్‌లోంచి తన పేరు గల్లంతయిందన్నారు. ‘‘సర్ తర్వాత ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో నేనూ ఒకడిని. జోక్ బాగుంది.. ఇక గేమ్ ఆన్’’ అంటూ మంగళవారం ఇన్‌స్టాలో ఆయన వీడియో పోస్ట్ చేశారు. తాను ఇదే సెగ్మెంట్‌లో పుట్టి పెరిగానని, స్కూలు, కాలేజీ చదువులు, సినిమా జీవితమంతా ఇక్కడే గడిచిందని పేర్కొన్నారు.
ఇదే నియోజకవర్గం నుంచి తాను ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశానని ప్రకాశ్‌రాజ్ గుర్తుచేశారు. ఇప్పడు సర్‌లో ఓటర్ లిస్ట్‌లోంచి తన పేరు తీసేస్తే.. తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఇంకేం ప్రక్రియ పూర్తి చేయాలి?.. అని ప్రశ్నించారు. ఇట్లా ఎంతమంది ఓటు హక్కును దూరంచేస్తారని ప్రశ్నించారు. ‘‘మీకు ఓటేయని కొంతమంది ఓటు హక్కును తొలిగించొచ్చు. కానీ, మమ్మల్ని ఆపగలరా? మిమ్మల్ని కిందకు దించేదాకా నిద్రపోం’’ అని ప్రకాశ్‌రాజ్ కామెంట్ చేశారు.
కాగా, చట్ట వ్యతిరేకంగా 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని ప్రకాశ్‌రాజ్ ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ విచారించిన బెంగళూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ప్రకాశ్ రాజ్‌కు ఇటీవలే బెయిల్ వచ్చింది.
