ఫిట్ గా.. కలర్ ఫుల్ గా ఉండటం ముఖ్యం అంటున్న నిధి...

ఫిట్ గా.. కలర్ ఫుల్ గా ఉండటం ముఖ్యం అంటున్న నిధి...

సోషల్ మీడియా కారణంగా అందంగా, ఫిట్గా కనిపించడం మరింత ముఖ్యంగా మారిందని చెప్పింది నిధి అగర్వాల్. హైదరాబాద్ లోని కొంపల్లిలో కలర్స్ హెల్త్కేర్ నూతన 'కలర్స్ 2.0' వెల్ నెస్ సెంటర్ను శుక్రవారం ఆమె ప్రారంభించింది. ఈ సందర్భంగా నిధి మాట్లాడుతూ 'లేటెస్ట్ టెక్నాల జీ, కొత్త మెషిన్లు, నిపుణులైన డా క్టర్స్తో కూడిన ఇలాంటి వెల్నెస్ సెంటర్లో హెల్త్, డైటింగ్పై శ్రద్ధ పెడితే మరింత మోటివేషన్ లభి స్తుంది. 

బరువు నిర్వహణ, చర్మం. జుట్టు సంరక్షణకు ఇది ఉపయోగక రంగా ఉంటుంది' అని చెప్పింది. సుచిత్ర ఎక్స్ రోడ్స్లో ఏర్పాటు చేసిన ఈ వెల్నెస్ సెంటర్లో సంస్థ ఎండీ డాక్టర్ విజయ్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన, ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణరాజ్ తుమ్మల తదితరులు పాల్గొన్నారు.