మీ చేయి చూపిస్తారా.. ఎందుకు జాతకం చెప్తావా.. మెగా డాటర్ నిహారిక క్రేజీ రిప్లయ్

మీ చేయి చూపిస్తారా.. ఎందుకు జాతకం చెప్తావా.. మెగా డాటర్ నిహారిక క్రేజీ రిప్లయ్

మెగా డాటర్ నిహారిక(Niharika) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె తరువాత నటిగా, నిర్మాతగా మారి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు తన బ్యానర్ లో వెడ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తీసిన నిహారిక ఇటీవలే ఒక ఫీచర్ ఫిలిం ను మొదలుపెట్టారు. అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఓపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా ఫుల్లు యాక్టివ్ గా ఉంటారు నిహారిక. 

అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్ లో తన అభిమానులతో ముచ్చటించారు. అందులో ఓ నెటిజన్ అడిగిన క్రేజీ ప్రశ్నకి సాలిడ్ కౌంటర్ వేశారు నిహారిక. ముందు ఆ నెటిజన్ నిహారికని మీ అరచేయి చూపించమని అడిగాడు. దానికి సమాధానంగా నిహారిక.. ఎందుకు బాబు జాతకం చెబుతావా? వద్దు బాబు.. నా ఫ్యూచర్ గురించి తెలియకపోతేనే హ్యాపీగా ఉంటాను.. అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.