నిహారిక యూనిక్ ఫిల్మ్..పోస్టర్ తోనే మెగా ఫ్యాన్స్ క్లీన్బోల్డ్

నిహారిక యూనిక్ ఫిల్మ్..పోస్టర్ తోనే మెగా ఫ్యాన్స్ క్లీన్బోల్డ్

నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక (Niharika Konidela) నటిస్తున్న చిత్రం ‘వాట్‌ ది ఫిష్‌’(What The Fish).‘వెన్‌ ది క్రేజీ బికమ్స్‌ క్రేజియర్‌’ అనేది ట్యాగ్ లైన్. వరుణ్‌ కోరుకొండ(Varun Korukonda) దర్శకత్వంలో విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ పాన్‌ ఇండియా సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. 

ఈ సినిమాలో నిహారిక పేరు అష్టలక్ష్మి అకా ఏయస్‌ హెచ్‌. చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక పోషిస్తున్న అష్టలక్ష్మి అకా ఏయస్‌ హెచ్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో నిహారిక  స్టైలిష్ గా నడుస్తూ కనిపించారు. ఆమె వెనుక డాలర్‌ ఇమేజ్‌ ఉంది. ఈ పాత్రని యూనిక్‌గా డిజైన్‌ చేసినట్లు దర్శకుడు చెప్పారు. 

తెలుగు సినిమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని పెర్మార్మెన్స్‌ ఓరియంటెడ్‌, యాక్షన్‌ డ్రివెన్‌ పాత్ర ఇదనీ, ప్రేక్షకులను అలరిస్తుందని వరుణ్ కోరుకొండ తెలిపారు.ఈ సినిమాకి ఫిదా మూవీ ఫేం శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ సన్నాహాలు చేస్తున్నారు.

వాట్‌ ది ఫిష్‌ మూవీ విషయానికి వస్తే..

చాలా గ్యాప్ తరువాత మంచు వారబ్బాయి మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న మూవీ వాట్ ది ఫిష్. డార్క్ కామెడీ, హై-ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఉంటుందని డైరెక్టర్ వరుణ్ వెల్లడించారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun ? (@afilmbyv)