మార్చి 4 న OTTలోకి సాగు మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మార్చి 4 న OTTలోకి సాగు మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వంశీ తుమ్మల, హారిక బల్ల లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో రూపొందిన ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘సాగు’.  వినయ్ రత్నం దర్శకత్వంలో యశస్వి వంగా నిర్మించారు. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించింది. మార్చి 4 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ,  టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్, ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా,  జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్ తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో నిహారిక మాట్లాడుతూ ‘ఈ మూవీ నాకు ఎంతో ప్రత్యేకమైనది. లైఫ్‌‌‌‌‌‌‌‌లో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ హోప్ అనేది వదలకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటాం. అలాగే వ్యవసాయంలో రైతులకు నమ్మకమిచ్చేలా ఈ సినిమా ఉంటుంది. 52 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ని 4 రోజుల్లో షూట్ చేశారు.

ఇలాంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది’ అని చెప్పింది. ఈ సినిమా తమకు మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నామన్నారు వంశీ, హారిక. రైతు గురించి చెప్పాలని ఈ చిత్రం తీశానని దర్శకుడు వినయ్ రత్నం అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.