నీలిరంగులో నిహారిక..కవితలతో ఆరాధిస్తోన్న అభిమానులు

నీలిరంగులో నిహారిక..కవితలతో ఆరాధిస్తోన్న అభిమానులు

మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక..ఇటీవలే వెబ్‌ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇటీవ‌ల త‌న సోద‌రుడు వ‌రుణ్ తేజ్ పెళ్లిలో ఆద్యంతం సంద‌డి చేస్తూ, ఫోటోషూట్ల‌లో ఫ్యాన్స్ ను మైమ‌రిపించింది.

లేటెస్ట్గా నిహారిక బ్లూ డిజైన‌ర్ ఫ్రాక్లో త‌ళ‌త‌ళా మెరిసిపోతున్న ఫోటోల‌ను షేర్ చేసింది. స్టైలిష్ లుక్‌ ఫోటోను షేర్‌ చేసి మెగా ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ బ్లూ డ్రెస్ పై ర‌క‌ర‌కాల కామెంట్లు ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఇందులో ఒక అభిమాని..'వావ్ మీరు స్వర్గం నుండి వచ్చిన మాగ్నోలియా పువ్వులా ఉన్నారు..బృహస్పతి యురేనస్ మెర్క్యురీ నెప్ట్యూన్..ప్లూటో తాజే కేర్ హ్యాపీ వీకెండ్` అని ఒక అభిమాని క‌విత అల్లాడు.

దీంతో అమాంతం ఫొటోస్కు భారీ హైప్ వచ్చేస్తోంది. ఇక ఫ్యాన్స్ తమదైన స్టైల్లో అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో అభిమాని అయిన ఉపేంద్ర యాద‌వ్ పిళ్లై అనే యువ‌కుడు సోష‌ల్ మీడియాల్లో ఒక అడుగు ముందుకేసి నిహారిక‌ను ఆరాధిస్తున్న క‌విత‌లు షేర్ చేసాడు. ఏది ఏమైనా నిహారికను ఆరాధించేవారు అంత‌కంత‌కు పెరుగుతున్నారు.

ప్రస్తుతం నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ వెనుక..ఏదో కారణం అయితే బలంగా ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా నాలుగు, ఐదు సినిమాలు చేసిన పెద్దగా ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో మళ్ళీ హీరోయిన్గా ఛాన్సెస్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఏదైనా బడా ప్రాజెక్ట్స్ నుంచి అవకాశం వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అవుతుందేమో చూడాలి.