సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి తెరకెక్కించిన చిత్రం ‘నిలవే’. శ్రేయాసి సేన్ హీరోయిన్. రాజ్ అల్లాడ నిర్మించారు. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కాగా మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వారా స్పందిస్తూ.. ఈ చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని చెబుతూ టీమ్‌ను అభినందించారు.
డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచిందని అతిథిగా హాజరైన దర్శకుడు వి సముద్ర అన్నారు. ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉందని, జెన్యూస్ హిట్‌గా తమ చిత్రం నిలిచిందని సౌమిత్ అన్నాడు. సపోర్ట్ చేసిన టీమ్‌కు దర్శకుడు థ్యాంక్స్ చెప్పాడు. జెమిని సురేష్, శ్రేయాసి సేన్, నిర్మాత రాజ్ అల్లాడ భార్య మాధురి, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ సహా టీమ్ పాల్గొన్నారు.
