కాంగ్రెస్ లో చేరిన నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ 

కాంగ్రెస్ లో చేరిన నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ 

నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కొడకల గంగాధర్, దేవరకోట దేవస్థానం డైరెక్టర్ చిలువేరి గంగాధర్ , మరో 50 మందికిపైగా కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరికలన్నీ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలు పుకు నాంది కాబోతున్నాయని శ్రీహరిరావు అన్నారు.