ఎన్ఐటీ వరంగల్‌లో 34 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. నవంబర్ 30 చివరి తేదీ

ఎన్ఐటీ వరంగల్‌లో 34 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. నవంబర్ 30 చివరి తేదీ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీ, వరంగల్) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 34.

విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్ 1, అసోసియేట్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–I 6, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–II 24.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  సంబంధిత డిసిప్లిన్​లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. పీహెచ్‌డీకి ముందు అభ్యసించిన అన్ని  డిగ్రీల్లోనూ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూలు రూ.200‌‌0, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలు రూ.1000 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: నవంబర్ 30.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, సెమినార్/ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.