Nithiin Alias Rukmini: నాని నిర్మాణంలో నితిన్ గ్రాండ్ కంబ్యాక్.. 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ అనౌన్స్!

Nithiin Alias Rukmini: నాని నిర్మాణంలో నితిన్ గ్రాండ్ కంబ్యాక్.. 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ అనౌన్స్!

బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నితిన్ (Nithiin).. ఈసారి గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. నాచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్న డిఫరెంట్ ఎంటర్‌టైనర్ 'అలియాస్ రుక్మిణి' (Alias Rukmini). ఇటీవల నాని హీరోగా నటించిన 'ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. నిర్మాతగా మాత్రం ఈ సినిమాతో బిగ్ స్కేల్‌లో థియేటర్లను షేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

లేటెస్ట్ గా ఈ సినిమా  రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. వచ్చే 2026 డిసెంబర్ 04న 'అలియాస్ రుక్మిణి' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో నితిన్ ఎలాంటి మాస్, కమర్షియల్ హంగామా లేకుండా, ఒక పక్కా మిడిల్ క్లాస్ కుర్రాడి లుక్‌లో చాలా సహజంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే, ఈ సినిమాలో టైటిల్ రోల్ 'రుక్మిణి'గా కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు సస్పెన్స్‌గానే ఉంచారు. ఆ సీక్రెట్‌ను వచ్చే మంగళవారం రివీల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై దీప్తి గంటాతో కలిసి నాని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నాని నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

డిసెంబర్ 4న రావలసిన ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా పడే అవకాశం ఉండటంతో.. నాగచైతన్య 'వృషకర్మ', విశ్వక్ సేన్ 'లెగసీ'తో పాటు నితిన్ 'అలియాస్ రుక్మిణి' కూడా రేసులోకి దిగింది. మరి ఈ డిసెంబర్ బాక్సాఫీస్ వార్‌లో నాని-నితిన్ కాంబో ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి.