నితిన్ ఎక్స్‌‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ నుంచి..సెకండ్ సింగిల్ రిలీజ్

నితిన్ ఎక్స్‌‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ నుంచి..సెకండ్ సింగిల్ రిలీజ్

నితిన్ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎక్స్‌‌ట్రా’ ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) ట్యాగ్‌‌లైన్‌‌తో శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌‌గా నటిస్తోంది. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి హే మామా బ్రష్ వెస్కో లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్లో మంచి సందేశం ఇస్తూ రాసిన పదాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. వద్దన్నా పడిపోతది ఫెయిల్యూర్ అనే నలుపు.. తుడిచేయకుంటే దాన్ని..రాదు కదా గెలుపు..అంటూ సాగిన లిరిక్స్ చాలా మోటివేట్గా ఉన్నాయి. హ్యారీస్ జైరాజ్ కంపోజ్ చేసిన ఈ పాటకి..రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ అందించారు. ఇప్పటికే రిలీజైన డేంజర్ పిల్లా సాంగ్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నితిన్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తుండగా..హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 8న విడుదల కానుంది.