బాలయ్య ఏందీ ఫ్యాన్స్ను కొడతాడంటా..? నవ్వులు పంచేలా ఎక్స్‌ట్రా ట్రైలర్‌

బాలయ్య ఏందీ ఫ్యాన్స్ను కొడతాడంటా..?  నవ్వులు పంచేలా ఎక్స్‌ట్రా ట్రైలర్‌

నితిన్ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎక్స్‌‌ట్రా’ ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man).నితిన్ కు జోడీగా బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్ నితిన్ విభిన్నమైన గెటప్‍ల్లో కనిపిస్తున్నాడు. 

లేటెస్ట్గా ఎక్స్‌‌ట్రా’ ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియెన్స్‌‌కి రోల‌‌ర్ కోస్టర్‌‌లాంటి ఎక్స్‌‌పీరియెన్స్‌‌నిస్తూ, న‌‌వ్విస్తూనే స‌‌ర్‌‌ప్రైజ్‌‌ల‌‌తో ట్రైలర్ అదిరిపోయింది. నాకు నేనంటే బోర్ అమ్మా..ఎప్పుడు ఇంకోలా ఉండాలనిపిస్తోందని హీరో అమ్మతో అనగా..నీలో యాక్టర్ ఉన్నాడురా అంటూ చెప్పుకొస్తూ..జూనియర్ ఆర్టిస్ట్‌ గా పరిచయం చేసే సీన్ ఆకట్టుకుంటోంది.

అలాగే షర్మిలమ్మ ఫేమస్ డైలాగ్ అయినా.. ఆడపిల్లను.. ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా..ఆడపిల్ల కాబట్టి అని నితిన్ చెప్పే డైలాగ్ మెస్మరైజింగ్గా ఉంది. ట్రైలర్ మొత్తం నవ్వులతో ఎంగేజింగ్గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ట్రైలర్లో ఈ తండ్రీ కొడుకుల మధ్య సీన్లు బాగా నవ్వించాయి.

ఇక చివర్లో రాజశేఖర్ స్పెషల్ అప్పియరెన్స్ ఆకట్టుకుంది. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు నితిన్ తో మాట్లాడే డైలాగులు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. "జీవితం చెప్పేది తప్ప..జీవితంలో ఎవరు ఏం చెప్పినా వినను" అని అంటాడు రాజశేఖర్. దానికి జీవితా సార్ అని నితిన్ అడుగుతాడు. జీవితం, జీవిత..నాకు రెండూ ఒకటే అని రాజశేఖర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది 

హ్యారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ మూవీని శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఎక్స్‌ట్రా మూవీ వచ్చే నెల డిసెంబర్ 8న రిలీజ్ కానుంది.