రుక్మిణి అలియాస్‌‌‌‌ టీచరమ్మ.. నితిన్ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

రుక్మిణి అలియాస్‌‌‌‌ టీచరమ్మ.. నితిన్ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

నితిన్ హీరోగా ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’.  హీరో నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇటీవల నితిన్‌‌‌‌ లుక్‌‌‌‌ను రివీల్ చేసిన మేకర్స్‌‌‌‌.. మంగళవారం ఇందులో హీరోయిన్‌‌‌‌ ఎవరనేది రివీల్‌‌‌‌ చేస్తూ తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్‌‌‌‌ ఇందులో నితిన్‌‌‌‌కు జంటగా నటిస్తోంది.

ఫస్ట్ లుక్ గ్లింప్స్‌‌‌‌లో ఆమెను రుక్మిణి అనే స్కూల్‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌గా పరిచయం చేశారు. స్కూల్ నోటీస్‌‌‌‌ బోర్డ్‌‌‌‌పై తన బొమ్మ వేసి డెవిల్, హిట్లర్‌‌‌‌‌‌‌‌, హోంవర్క్ పోలీస్‌‌‌‌ అంటూ పేర్లు పెడతారు స్టూడెంట్స్‌‌‌‌. ఆ బొమ్మ వైపు తదేకంగా చూసిన ఆమె.. నిజమే అది తానేనన్నట్టుగా బొమ్మ పక్కనే తన పేరు రాసి వెళ్లిపోతూ పిల్లలకు వార్నింగ్ ఇస్తుంది. తన క్యారెక్టర్‌‌‌‌లోని కమాండింగ్‌‌‌‌, ఆరోగెంట్‌‌‌‌ బిహేవియర్‌‌‌‌‌‌‌‌ను ఇలా ఈ గ్లింప్స్‌‌‌‌లో చూపించారు.  

టీచర్‌‌‌‌‌‌‌‌ పాత్రలో తన లుక్‌‌‌‌, నటన ఆకట్టుకున్నాయి.  ఇందులో సాయికుమార్, హర్షవర్ధన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.  షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నారు.