చంద్రశేఖర్ యేలేటితో నితిన్ సినిమా

చంద్రశేఖర్ యేలేటితో నితిన్ సినిమా

హోలీ పండుగ కానుకగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు హీరో నితిన్‌.  ట్విటర్‌ వేదికగా గురువారం తన కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను తెలిపాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన నితిన్.. ‘ముందుగా చెప్పినట్లుగానే నా కొత్త సినిమాలకు సంబంధించిన మొదటి ప్రకటన. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న చంద్రశేఖర్‌ యేలేటితో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత.  కీరవాణి మ్యూజిక్. చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఏప్రిల్‌ నుంచి షూటింగ్ మొదలవుతుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుపుతాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు నితిన్‌.

ప్రస్తుతం నితిన్‌.. ‘భీష్మ’  సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో నితిన్‌ కు జోడీగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ కుడుముల డైరెక్టర్. ఈ నెలలోనే తన కొత్త సినిమాల గురించి ప్రకటన చేస్తానని, అభిమానులు కాస్త ఓపిక పట్టాలని గతంలో నితిన్‌ తెలిపాడు.  ఈ మధ్యన సరైన హిట్టులేని నితిన్..వరుసపెట్టి సినిమాలకు గ్రీస్ సిగ్నల్ ఇస్తున్నాడు.