
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటి లయ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
‘భూ అంటే భూతం’ అంటూ సాగే మొదటి పాటను ఈనెల 17న సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. తన మేనకోడలిని ఆడిస్తూ హీరో పాడే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించినట్టు కొత్త పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఈ పాటను అజనీష్ లోకనాథ్ కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి ఆకట్టుకునేలా పాడారు.