సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ప్రతిభతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్న చర్చ తరచూ వినిపిస్తుంటుంది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతుంటాయి. టాలీవుడ్, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నీతీ టేలర్ (Niti Taylor) లేటెస్ట్ గా వెల్లడించిన విషయాలు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, 'క్యాస్టింగ్ కౌచ్' (Casting Couch) దారుణాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి బహిరంగంగా బయటపెట్టారు.
నీతి టేలర్ 2012 నుంచి 2014 మధ్య మూడు తెలుగు చిత్రాల్లో నటించింది. తన సినీ ప్రయాణాన్ని 2012లో తనిష్ హీరోగా నటించిన చిత్రం 'మేం వయసుకు వచ్చాం' సినిమాతో ప్రారంభించింది. ఆ తర్వాత 2013లో 'పెళ్లి పుస్తకం' చిత్రంలో నటించారు. అయితే తొలి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ దర్శకుడే తనకు ఫోన్ చేసి మరో ఆఫర్ ఇస్తానని చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.
కానీ ఆ సంభాషణ ఊహించని మలుపు తిరుగుతూ.. 'మరో సినిమాలో అవకాశం రావాలంటే నువ్వు నాతో గడపాలి (sleep with me)' అంటూ ఆ దర్శకుడు అత్యంత వేధింపులకు గురిచేశాడని నీతీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్షణంలో ఏం చేయాలో తోచక తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. వెంటనే ఫోన్ కట్ చేసి.. ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, నేరుగా తన తల్లికి ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించినట్లు ఆమె వెల్లడించారు.
ఆ వృద్ధ దర్శకుడి ప్రవర్తన చూసి తాను షాక్ అయ్యాను. సినిమాలకు దూరం కావడానికి ఇలాంటి చేదు అనుభవాలే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్‌ను వీడి బుల్లితెరకు పరిచయమైన నీతీ, పలు ప్రముఖ సీరియల్స్‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అప్పట్లో ఆ దర్శకుడి పేరు బయటపెట్టనప్పటికీ, ఆమె చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
You have to SLEEP with me THIS time 🥴 Sensational casting couch reveal on Trinadharao Nakkina by Niti Taylor. https://t.co/jjviVOtGLY
— The Cine Gossips (@TheCineGossips) October 13, 2026
