నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన

నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన

 హైదరాబాద్ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.  సెమిస్టర్  ఎగ్జామ్ ఫీజు కట్టలేదని 15 మంది విద్యార్థులను కాలేజ్ సిబ్బంది ఎగ్జామ్ కు అనుమతించలేదు దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు.  తమకు ఎగ్జామ్ ఫీజ్ విషయంలో సమాచారం లేదని ... ఇప్పుడు ఫీజ్ కడతామని ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

కాలేజ్ ప్రిన్సిపాల్  ఎగ్జామ్ కు అనుమతివ్వకపోవడంతో   ఎగ్జామ్ ను బైకాట్ చేసిన తోటి విద్యార్థులు 15 మందితో కలిసి ఆందోళనకు దిగారు . గతంలో  ఇలా జరిగితే ఫీజ్ కట్టి ఎగ్జామ్ కు అనుమతించారని చెప్పారు విద్యార్థులు.  15 మందిని  ఎగ్జామ్ కు అనుమతిస్తేనే తాము ఎగ్జామ్ రాస్తామని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అబిడ్స్ పోలీసులు ఆందోళన విరమించాలని విద్యార్థులను కోరారు.  అయినా వినకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు విద్యార్థులు.